జగనన్న పాలనలో చేసిన మంచిని ఇంటింటా వివరించాలి
కూటమి ప్రభుత్వ మోసాలనుప్రజల్లోకి తీసుకెళ్లాలి
పార్టీ శ్రేణులకు మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు దిశానిర్దేశం
దేవరాపల్లి: స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు పార్టీ శ్రేణులంతా సమన్వయంతో కృషి చేయాలని మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు పిలుపునిచ్చారు. మండలంలోని వాకపల్లి, వెంకటరాజుపురం గ్రామాల వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలతో బుధవారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికీ వెళ్లి వివరించాలని సూచించారు. సూపర్‌సిక్స్ హామీల పేరిట కూటమి ప్రభుత్వం చేసిన మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. కూటమి పాలనపై విసుగుచెందిన ప్రజలు స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. పోలింగ్‌కు సమయం తక్కువగా ఉన్నందున ప్రణాళికాబద్ధంగా ప్రతి ఓటరునూ కలిసి ప్రచారం ముమ్మరం చేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అభ్యర్థి, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు బూరె బాబూరావు, మాజీ జెడ్పీటీసీ కర్రి సత్యం, వాకపల్లి ఎంపీటీసీ అభ్యర్థి బుగత రాజేశ్వరి, మాజీ ఎంపీటీసీ దొగ్గ అప్పలనాయుడు, మాజీ సర్పంచ్ దాసరి సంతోష్‌కుమార్, దాసరి రాజునాయుడు, రాణం నాయుడుబాబు, తదితరులు పాల్గొన్నారు.


