నదులు, జలాశయాలకు వరద పోటు | - | Sakshi
Sakshi News home page

నదులు, జలాశయాలకు వరద పోటు

Oct 29 2026 1:24 AM | Updated on Oct 29 2026 1:24 AM

మాడుగుల/దేవరాపల్లి/కోటవురట్ల/చీడికాడ: పెద్దేరు జలాశయానికి వరద నీరు పోటెత్తింది. అర్నబ్‌ తుపాను కారణంగా వర్షాలు అధికంగా కురవడంతో జలాశయంలోకి ప్రస్తుతం 3 వేలు క్యూసెక్కులు వరద నీరు వచ్చి చేరడంతో ప్రస్తుతం జలాశయం నుంచి రెండు గేట్లు ద్వారా 3 వేల క్యూసెక్కులు వరద నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. కోనాం జలాశయంలోకి 800 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. గరిష్ట నీటిమట్టం 101.20 మీటర్లు కాగా, ప్రస్తుతం 99.80 మీటర్లకు చేరింది. రైవాడ జలాశయం గరిష్ట నీటిమట్టం 114 మీటర్లు కాగా ప్రస్తుతం 107.60 మీటర్లుకు చేరుకుంది. తామరబ్బ వద్ద శారదానది వంతెన మీదుగా ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో వంతెన మీదుగా రాకపోకలు సాగించకుండా పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు. పాతరోడ్డు వద్ద వరాహనదిలో సర్పానది కలియడంతో మరింత ఉగ్రంగా మారింది. కై లాసపట్నం ప్రాంతంలో వరాహనది తీరం కోతకు గురవుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement