మామిడిపాలెం ఎంపీటీసీ స్థానంపై కూటమిలో కుమ్ములాట | - | Sakshi
Sakshi News home page

మామిడిపాలెం ఎంపీటీసీ స్థానంపై కూటమిలో కుమ్ములాట

Oct 29 2026 1:24 AM | Updated on Oct 29 2026 1:24 AM

జనసేన, బీజేపీ అభ్యర్థులు నామినేషన్లు

తుమ్మపాల: స్థానిక సంస్థల ఎన్నికల వేళ అనకాపల్లి మండలం మామిడిపాలెం ఎంపీటీసీ స్థానంపై కూటమి పార్టీల మధ్య కుమ్ములాట మొదలైయింది. కూటమి తరపున ఒకే అభ్యర్థిని బరిలోకి దించాల్సి ఉండగా, జనసేన, బీజేపీ పార్టీలకు చెందిన అభ్యర్థులు వేర్వేరుగా నామినేషన్లు దాఖలు చేయడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. జనసేన తరపున పూడి నాగలక్ష్మి, బీజేపీ తరుపున కొరపోలు జ్యోతి నామినేషను దాఖలు చేశారు. ఇద్దరికీ ఆయా పార్టీల నుంచి బీ–ఫారాలు అందడంతో పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. కూటమి పార్టీల మధ్య సమన్వయంతో అభ్యర్థిని ఖరారు చేయాల్సి ఉండగా, రెండు పార్టీల అభ్యర్థులకు బీ–ఫారాలు అందడం కూటమిలో నెలకొన్న పరిస్థితికి అద్దం పడుతోంది. కూటమి నాయకులు జోక్యం చేసుకుని ఏకాభిప్రాయం సాధిస్తారా...లేక మిత్రపక్షాల అభ్యర్థుల మధ్యే పోటీ కొనసాగుతుందా.. అనేది ఆసక్తి రేపుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement