అచ్యుతాపురం రూరల్ : మండలంలో సెజ్ పునరావాస కాలనీ దిబ్బపాలెం–1 ఎంపీటీసీ స్థానానికి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి లాలం నాగమణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎంపీటీసీ స్థానానికి పోటీ లేకపోవడంతో ఎన్నికలు జరగకుండానే ఆమె విజయం ఖరారైంది. లాలం నాగమణి భర్త లాలం శ్రీనివాసరావు గతంలో దిబ్బపాలెం–1 ఎంపీటీసీగా పనిచేసి పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఆయన నాయకత్వంపై ఉన్న నమ్మకం, స్థానికంగా ఉన్న పరిచయాలు, ప్రజల ఆదరణ నేపథ్యంలో ఈసారి తన భార్య నాగమణిని దిబ్బపాలెం–1 ఎమ్‌పీటీసీ అభ్యర్ధిగా బరిలోకి దించారు. దీంతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండల ఎంపీపీ అభ్యర్ధిగా కూడా లాలం నాగమణి పేరు ఖరారు కావడంతో ఈ ఏకగ్రీవ విజయం వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణుల్లో ఆనందాన్ని నింపింది.


