పునరావాస చర్యలు పరిశీలించిన కలెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

పునరావాస చర్యలు పరిశీలించిన కలెక్టర్‌

Oct 28 2026 12:48 AM | Updated on Oct 28 2026 12:48 AM

వమ్మవరం పునరావస కేంద్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌

ఎస్‌.రాయవరం : లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు ముందుగా తరలించాలని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ సూచించారు. వర్షాల తీవ్రత పరిశీలించేందుకు మంగళవారం కలెక్టర్‌ మండలంలో పర్యటించారు. వరాహనది పరివాహక ప్రాంతాన్ని పరిశీలించి వమ్మవరంలో ఏర్పాటు చేసి పునరావస కేంద్రాన్ని పరిశీలించారు. ఇక్కడ సుమారు 40 కుటుంబాలను తరలించి ఉండగా వారితో కలెక్టర్‌ మాట్లాడి తుపాను తీవ్రత తగ్గే వరకు ఈ కేంద్రంలో అన్ని రకాల సదుపాయాలు అందుతాయని చెప్పారు. ఈ పర్యటనలో కలెక్టర్‌తో పాటు తహసీల్దార్‌ జె. రమేష్‌బాబు తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement