ఎస్.రాయవరం : మండల కేంద్రంలో టీడీపీకి షాక్ తగిలింది. ఎంపీటీసీ ఎన్నికల వేళ కూటమి నేతలు తప్పుడు వాగ్దానాలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని టీడీపీకి చెందిన కశింకోట మణికంఠతో మరో 10 కుటుంబాలు, గ్రామ వైఎస్సార్సీపీ గ్రామశాఖ అధ్యక్షుడు కర్రి కోటేశ్వరరావు సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. కోటేశ్వరరావు వైఎస్సార్సీపీ కండువాలు వేసి ఆహ్వానించారు. ఎంపీటీసీ2 అభ్యర్ధి దాడి జగదీశ్వరి ఎన్నికల ప్రచారానికి వెళ్లిన సమయంలో ఆ కుటుంబాలు ఈ నిర్ణయం తీసుకుని పార్టీలో చేరినట్టు చెప్పారు. కూటమి నేతలు అధికారంలోనికి వచ్చి రెండున్నర ఏళ్లు అవుతున్నా వృద్ధులకు ఒక్క కొత్త పింఛను ఇవ్వలేకపోయారని, ఇప్పుడు మరోమారు కూటమి నేతలకు ఓటు వేయమని అడగడం విడ్డూరంగా ఉందని పార్టీలో చేరిన సభ్యులు చెప్పారు. మాజీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి చెప్పిన మాట చెప్పినట్టుగా వ్యవహరిస్తూ పేద ప్రజలకు సకాలంలో సంక్షేమ పథకాలు అందజేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు బంగారి లక్ష్మణరావు, పార్టీ నాయకులు కర్రి గాంధీ, లక్కోజు ఆదిమూర్తి, దుబాసి నవీన్, గట్టెం పర్వతాలు, సూరిబాబు, శివ, శ్రీను, పోతురాజు తదితరులు ఉన్నారు.


