యలమంచిలి పట్టణ పరిధి 29వ వార్డు గొల్లలపాలెంలో
వైఎస్సార్‌సీపీలో చేరిన టీడీపీ మద్దతుదారులు
ఉమ్మలాడలో కూటమి పార్టీల నాయకులకు వైఎస్సార్‌సీపీ కండువాలు కప్పి ఆహ్వానిస్తున్న పార్టీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్
మునగపాక: స్థానిక సంస్థల ఎన్నికల వేళ మండలంలోని ఉమ్మలాడలో టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన పలువురు నాయకులు వైఎస్సార్‌సీపీలో చేరారు. దసరా పర్వదినం సందర్భంగా పార్టీలో చేరిన వారికి వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేసిన సంక్షేమ పథకాలకు ప్రజల్లో ఆదరణ ఉందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయానికి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీలో చేరిన వారిలో వార్డు మాజీ సభ్యుడు, టీడీపీ నాయకుడు కాండ్రేగుల మహాలక్ష్మినాయుడుతో పాటు జనసేనకు చెందిన రాపేటి రాజు, కోడి రాజు, పలువురు నాయకులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ ఆడారి గణపతి అచ్చియ్యనాయుడు, వైఎస్సార్‌సీపీ ఎంపీపీ అభ్యర్థి మొల్లేటి శంకర్, మాజీ సర్పంచ్ నూకరాజు, పార్టీ నాయకులు పల్లెల అప్పలనాయుడు, కాండ్రేగుల రామప్పారావు, విల్లూరి సత్తిబాబు, మొల్లేటి అచ్చియ్యనాయుడు, ఆటో శ్రీనివాసరావు, పెంటకోట నరసింగరావు, కాండ్రేగుల చిన్న, మద్దాల అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.
యలమంచిలి 29వ వార్డులో టీడీపీకి బిగ్ షాక్
యలమంచిలి రూరల్: మున్సిపాలిటీ పరిధి 29వ వార్డు గొల్లలపాలెంలో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు నమ్మి రమణకు టికెట్ ఇవ్వకపోవడంతో సుమారు 50 కుటుంబాలకు చెందిన 100 మంది బుధవారం రాత్రి వైఎస్సార్‌సీపీలో చేరారు. ఇక్కడ జనసేనకు వార్డు టికెట్ కేటాయించడంతో అసంతృప్తికి గురైన రమణ వర్గీయులు, టీడీపీ మద్దతుదారులు బుధవారం పెద్ద ఎత్తున ఫ్యాన్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారందరికీ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బోదెపు గోవింద్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బొద్దపు ఎర్రయ్యదొర కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఒమ్మి తాతాజీ, నమ్మి అప్పారావు, ఈగల సత్తిబాబు, మొల్లి రాము, బర్ల వెంకన్న, కోన చిరంజీవి, నమ్మి రాము, నమ్మి అప్పలనర్స, మురుకుర్తి అప్పలరాజు, కోన చిన్నోడు, ఒమ్మి సన్యాసమ్మ, తదితరులు వైఎస్సార్‌సీపీలో చేరిన వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో వెఎస్సార్‌సీపీ నాయకులు దాసరి కుమార్, దాసరి గణేష్, బొద్దపు మణి ప్రకాష్, ఒమ్మి జగదీష్ రెల్లి కాలనీ చినబ్బాయి, పట్నాల కల్యాణం, పల్లా రాజబాబు, బర్నికల శ్రీను, ఇసరపు లోవరాజు, కోన సత్తిబాబు, కోన అప్పలరాజు, తదితరులు పాల్గొన్నారు.


