జెడ్పీటీసీ రిటర్నింగ్ అధికారి సత్యనారాయణకు నామినేషన్ పత్రం అందజేస్తున్న అచ్యుతాపురం వైఎస్సార్‌సీపీ అభ్యర్థి నరాల సుహాసిని
అనకాపల్లి: జిల్లా పరిషత్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. అనకాపల్లిలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కేంద్రంలో వివిధ మండలాలకు చెందిన జెడ్పీటీసీ అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి డి.సత్యనారాయణకు అందజేశారు.
తొలిరోజు మొత్తం 24 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అచ్యుతాపురం నుంచి నరాల సుహాసిని, రావికమతం నుంచి జోగ వరలక్ష్మి, బుచ్చెయ్యపేట నుంచి పైలా సన్యాసిరావు, మునగపాక నుంచి ఆడారి కుమారి నామినేషన్లు వేశారు. నామినేషన్ కేంద్రం వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పట్టణ సీఐ జి.ప్రేమ్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. వైఎస్సార్‌సీపీ నుంచి 6, టీడీపీ 7, జనసేన 2, బీజేపీ 4, ఇతరులు 2, డమ్మీ నామినేషన్లు మూడు పడ్డాయి.


