వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా గ్రామ వలంటీర్‌ | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా గ్రామ వలంటీర్‌

Oct 22 2026 3:50 AM | Updated on Oct 22 2026 3:50 AM

పరవాడ: గత వైఎస్సార్‌సీపీ హయాంలో గ్రామ వలంటీర్‌గా ప్రజలకు విశేష సేవలందించిన రావాడ రోజాప్రియాంక ప్రస్తుత స్థానిక సంస్థల ఎన్నికల బరిలో ఆ పార్టీ తరఫున ఎంపీటీసీ అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నారు. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌ ఆధ్వర్యంలో పెదముషిడివాడ ఎంపీటీసీ స్థానానికి పార్టీ తరఫున ఆమె బుధవారం నామినేషన్‌ దాఖలు చేశారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో అట్టహాసంగా తరలివచ్చి స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ఎ.విజయప్రకాష్‌, ఎంపీడీవో మల్లికార్జునరావులకు తన నామినేషన్‌ పత్రాన్ని సమర్పించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి పైల శ్రీనివాసరావు, ఎస్‌ఈసీ సభ్యుడు పైల సన్యాసిరాజు అభ్యర్థికి మద్దతుగా నిలిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement