మునగపాక: దళితుల అభ్యున్నతికి మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పెద్దపీట వేశారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ అన్నారు. ఈ నెల 11న నిర్వహించనున్న పార్టీ ఎస్సీ సెల్ జిల్లా విస్తృత స్థాయి సమావేశం విజయవంతంలో భాగంగా శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితుల అభ్యున్నతికి ఎంతో కృషి చేసిన వైఎస్ జగన్ మరోసారి సీఎం కావడం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయమే లక్ష్యంగా పాటు పడాలన్నారు. నియోజకవర్గాల సమన్వయకర్తల సూచనలు, సలహాలు పాటిస్తూ దళితుల ఐక్యతను చాటాలన్నారు. 11న జరగనున్న సమావేశానికి పెద్ద ఎత్తున దళితులు తరలిరావాలన్నారు. ఎస్సీ సెల్ జిల్లా ఽఅధ్యక్షుడు సురేష్ రాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎస్సీ విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి అల్లంపల్లి రాజుబాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐడీ బాబు, రాష్ట్ర కార్యదర్శులు వేచలపు ప్రకాష్, దండా జ్ఞానదీప్, సుధీర్, రాజాన బుజ్జి, కోనపల్లి రామ్మోహనరావు, దిమ్మల శివ, పలు నియోజకవర్గ, మండల శాఖ అధ్యక్షులు పాల్గొన్నారు.
గాంధీ ఆశయ సాధనకు కృషి చేయాలి
ప్రతి ఒక్కరూ జాతిపిత మహాత్మాగాంధీ ఆశయ సాధనకు పాటుపడాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ పిలుపునిచ్చారు. స్థానిక పార్టీ కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకల్లో భాగంగా బాపూజీ చిత్ర పటానికి ప్రసాద్‌తో పాటు పలువురు నేతలు నివాళులర్పించారు.


