నైట్‌ వాచ్‌వుమన్‌ ఆత్మహత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

నైట్‌ వాచ్‌వుమన్‌ ఆత్మహత్యాయత్నం

Oct 3 2026 2:08 AM | Updated on Oct 3 2026 2:08 AM

● గర్నికం కేజీబీవీలో పని ఒత్తిడే కారణం! ● అటువంటిదేమీ లేదంటున్న అధికారులు

రావికమతం: గర్నికం కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం(కేజీబీవీ)లో నైట్‌ వాచ్‌వుమన్‌గా పని చేస్తున్న ఆకుల లక్ష్మి గురువారం రాత్రి అధిక మోతాదులో థైరాయిడ్‌, పెయిన్‌కిల్లర్‌ మాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించింది. ఇందుకు పని ఒత్తిడే కారణమని ఆమె భర్త తలుపులు ఆరోపించారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన లక్ష్మిని తోటి సిబ్బంది వెంటనే రావికమతం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి, అనంతరం మెరుగైన చికిత్స కోసం అనకాపల్లి ఎన్టీఆర్‌ ఆస్పత్రికి, అక్కడి నుంచి విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించారు. ప్రస్తుతం ఆమె కేజీహెచ్‌లో చికిత్స పొందుతోంది. ఘటనపై రావికమతం ఎస్‌ఐ రఘువర్మ, ఎంఈవో లింగమూర్తి, జిల్లా గర్ల్‌ చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ అధికారి జమీమా శుక్రవారం కేజీబీవీని సందర్శించి ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులను విడివిడిగా విచారించారు. విచారణలో నైట్‌ వాచ్‌వుమన్‌పై ఎలాంటి అదనపు పని ఒత్తిడి లేదని తేలిందని అధికారులు తెలిపారు. కేజీబీవీ స్పెషల్‌ ఆఫీసర్‌ నాగలక్ష్మి మాట్లాడుతూ జాబ్‌ చార్ట్‌లో ఉన్న పనులనే అప్పగిస్తున్నామని, ఎలాంటి వేధింపులు లేవని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement