విశాఖ డివిజన్‌లో విస్తృతంగా ‘స్వచ్ఛతా హీ సేవా’ | - | Sakshi
Sakshi News home page

విశాఖ డివిజన్‌లో విస్తృతంగా ‘స్వచ్ఛతా హీ సేవా’

Oct 3 2026 2:08 AM | Updated on Oct 3 2026 2:08 AM

తాటిచెట్లపాలెం: సౌత్‌ కోస్ట్‌ రైల్వే విశాఖపట్నం డివిజన్‌ పరిధిలో విస్తృతంగా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ లలిత్‌ బోహ్రా తెలిపారు. గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం డీఆర్‌ఎం కార్యాలయం వద్ద ఆయన మాట్లాడుతూ గత నెల 17 నుంచి ఈ నెల 2 వరకు చేపట్టిన స్వచ్ఛతా పక్షోత్సవాల ద్వారా ప్రయాణికులకు, ప్రజలకు శుభ్రత, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించామన్నారు. రైల్వే అధికారులు, సిబ్బంది, సఫాయి మిత్ర, విద్యార్థులు, ప్రతినిధుల సహకారంతో సౌత్‌ కోస్ట్‌ రైల్వే ప్రధాన కార్యాలయం ద్వారా నిర్దేశించిన 700 క్లీన్లినెస్‌ టార్గెట్‌ యూనిట్స్‌లో 650 యూనిట్స్‌లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి, పరిశుభ్రంగా ఉంచగలిగామని చెప్పారు. 130 ఏళ్ల విశాఖపట్నం రైల్వే స్టేషన్‌ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించి.. హెరిటేజ్‌ గ్యాలరీ వంటివి ఏర్పాటు చేశామన్నారు. స్కూల్‌ విద్యార్థులకు ఎస్టీపీ ప్లాంట్ల పరిశీలన, చిత్రలేఖన పోటీలు, క్రీడలు, సామాజిక కార్యక్రమాలు నిర్వహించామన్నారు. రైల్వే సఫాయి మిత్రల సంక్షేమం కోసం ఆరోగ్య తనిఖీలు, అవగాహన కార్యక్రమాలు, సన్మానాలు చేసినట్లు తెలిపారు. అనంతరం డీఆర్‌ఎం కార్యాలయం నుంచి సైకిల్‌ ర్యాలీ, అవగాహన ర్యాలీలు నిర్వహించారు. డీఆర్‌ఎంతోపాటు రైల్వే అధికారులు, సిబ్బంది, శానిటేషన్‌ కార్మికులు, స్కౌట్స్‌, అండ్‌ గైడ్స్‌, డివిజనల్‌ కల్చరల్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు, సౌత్‌ కోస్ట్‌ రైల్వే ఉమెన్స్‌ వెల్ఫేర్‌ ఆర్గనైజేషన్‌ డివిజన్‌ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement