నేల సంరక్షణపై చైతన్యానికి పరుగు | - | Sakshi
Sakshi News home page

నేల సంరక్షణపై చైతన్యానికి పరుగు

Oct 3 2026 2:08 AM | Updated on Oct 3 2026 2:08 AM

● ‘సేవ్‌ సాయిల్‌’ కోసం 7,600 కి.మీ. పరుగెత్తిన విశాఖ ఇంజినీర్‌

అల్లిపురం: నేల ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నగరానికి చెందిన 58 ఏళ్ల చార్టర్డ్‌ సివిల్‌ ఇంజినీర్‌ సుబ్రహ్మణ్య శర్మ చల్లా చేపట్టిన ‘సేవ్‌ సాయిల్‌’ పరుగు యాత్ర కొనసాగుతోంది. ఇందులో భాగంగా శుక్రవారం విజయవాడలో నిర్వహించిన ‘స్వచ్ఛథాన్‌–2026’ హాఫ్‌ మారథాన్‌లో ఆయన 21.1 కిలోమీటర్ల పరుగును విజయవంతంగా పూర్తి చేశారు. ‘సేవ్‌ సాయిల్‌’ జెండాను చేతబూని నాలుగున్నరేళ్లుగా దేశవ్యాప్తంగా వివిధ పరుగు కార్యక్రమాల్లో పాల్గొంటున్న శర్మ ఇప్పటివరకు విశాఖ, విజయవాడ, కాకినాడ, అమలాపురం, హైదరాబాద్‌, బెంగళూరు, గోవా, రాయ్‌పూర్‌, భువనేశ్వర్‌, సంబల్‌పూర్‌, బలంగీర్‌ తదితర నగరాల్లో సుమారు 7,600 కిలోమీటర్లు పరుగెత్తారు. ఈ సందర్భంగా శర్మ మాట్లాడుతూ వాయు, జల కాలుష్యంపై ప్రజల్లో అవగాహన పెరుగుతున్నప్పటికీ, నేల ఆరోగ్యంపై మరింత చైతన్యం అవసరమన్నారు. నేల మనకు ఆహారాన్ని అందించడంతో పాటు సమస్త జీవ వ్యవస్థకు ఆధారంగా నిలుస్తుందని పేర్కొన్నారు. నేలను సంరక్షించి, దాని సారాన్ని పునరుద్ధరించాల్సిన ఆవశ్యకతను ప్రజలకు తెలియజేయడమే తన పరుగు యాత్ర లక్ష్యమని తెలిపారు. సద్గురు ప్రారంభించిన ‘సేవ్‌ సాయిల్‌’ ఉద్యమం స్ఫూర్తితో శర్మ నాలుగున్నరేళ్ల క్రితం ఈ పరుగు యాత్రను ప్రారంభించారు. అప్పటి నుంచి మారథాన్‌లు, సుదూర పరుగుల్లో పాల్గొంటూ నేల సంరక్షణ, సారవంతమైన మట్టి ప్రాధాన్యతపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ‘స్వచ్ఛథాన్‌–2026’లో 21.1 కి.మీ. పరుగు పూర్తి చేయడం తన ‘సేవ్‌ సాయిల్‌’ ప్రచార యాత్రలో మరో మైలురాయిగా నిలిచిందని శర్మ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement