ఢీకొన్న బైక్‌, స్కూటీ! | - | Sakshi
Sakshi News home page

ఢీకొన్న బైక్‌, స్కూటీ!

Oct 3 2026 2:08 AM | Updated on Oct 3 2026 2:08 AM

● ఎదురెదురుగా వస్తుండగా ప్రమాదం ● ఐదుగురికి తీవ్ర గాయాలు ● క్షతగాత్రులు ఆస్పత్రికి తరలింపు ● కొరొంజిగుడ మలుపు వద్ద ఘటన

డుంబ్రిగుడ: మండలంలోని సొవ్వ పంచాయతీ పరిధిలోని కొరొంజిగుడ ఘాట్‌ రోడ్డు మలుపు వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న బైక్‌, స్కూటీ ఢీకొనడంతో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సొవ్వ వైపు నుంచి అరకు వారపు సంతకు బైక్‌పై గొప్పులవలస గ్రామానికి చెందిన నూకన్న, ఆయన భార్య డాలిమ్మతో పాటు మాలింగవలస గ్రామానికి చెందిన హరిశ్చంద్రప్రసాద్‌ ప్రయాణిస్తున్నారు. అదే సమయంలో అరకు వైపు నుంచి సొవ్వకు స్కూటీపై సొవ్వ వీఆర్పీ లక్ష్మి, ఆమె భర్త స్వామి వస్తుండగా.. కొరొంజిగుడ మలుపు వద్ద రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురితో పాటు స్కూటీపై ఉన్న ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద విషయం తెలుసుకున్న సొవ్వ మాజీ సర్పంచ్‌, వైఎస్సార్‌సీపీ మండల ఉపాధ్యక్షుడు పొట్టంగి రామ్‌ప్రసాద్‌ తక్షణమే స్పందించారు. స్థానిక యువకులు గుంటా సాంబ, ఎస్‌. కృష్ణ, నాగేష్‌, చిన్న, కోటి తదితరులతో కలిసి వెంటనే అంబులెన్స్‌ను రప్పించి, క్షతగాత్రులను అరకులోయ ఏరియా ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement