గాంధీజీ మార్గం అనుసరణీయం | - | Sakshi
Sakshi News home page

గాంధీజీ మార్గం అనుసరణీయం

Oct 3 2026 1:26 AM | Updated on Oct 3 2026 1:26 AM

● హోంమంత్రి వంగలపూడి అనిత ● ఘనంగా స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర అవార్డుల ప్రదానం

అనకాపల్లి: మహాత్మ గాంధీజీ ఆలోచనలను ఆచరిస్తూ పరిశుభ్రత, సేవాభావం వంటి విలువలను ప్రతి ఒక్కరూ పాటించాలని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు. స్థానిక రింగ్‌రోడ్డులోని పెంటకోట కన్వెన్షన్‌ హాల్లో శుక్రవారం స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం కలెక్టర్‌ విజయకృష్ణన్‌ అధ్యక్షతన ఘనంగా జరిగింది. ముందుగా మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా బాపూజీ చిత్రపటానికి హోంమంత్రి, కలెక్టర్‌, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. గోదావరి జలాలు ఉత్తరాంధ్రకు రావడం ఒకప్పుడు కలగా ఉండేదన్నారు. ప్రస్తుతం జిల్లాలో అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతోందని తెలిపారు. కలెక్టర్‌ విజయకృష్ణన్‌ మాట్లాడుతూ స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణ ఆంధ్ర లక్ష్యాల సాధనలో భాగంగా జిల్లాను పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు. గాంధీ జయంతి సందర్భంగా ప్రతి ఏడాది రాష్ట్రంలో స్వచ్ఛ ఆంధ్ర అవార్డులు అందజేస్తున్నట్లు తెలిపారు. పారిశుధ్యం, పరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణలో ఉత్తమ పనితీరు కనబరిచిన పట్టణ సంస్థలు, గ్రామ పంచాయతీలు, ప్రభుత్వ, వాణిజ్య, కమ్యూనిటీ సంస్థలను ప్రోత్సహించేందుకు ఈ అవార్డులు ప్రదానం చేస్తున్నామన్నారు. 2026లో నిర్వహించిన రెండు రాష్ట్ర స్థాయి సర్వేల ఆధారంగా జిల్లాకు మొత్తం 67 అవార్డులు లభించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ శౌర్యమాన్‌పటేల్‌, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement