సేవల్లేవ్‌..! | - | Sakshi
Sakshi News home page

సేవల్లేవ్‌..!

Oct 3 2026 1:26 AM | Updated on Oct 3 2026 1:26 AM

వైఎస్సార్‌సీపీ హయాంలో

జిల్లాలో 7 అగ్రిల్యాబ్‌ల నిర్మాణం

ప్రసుతం చంద్రబాబు పాలనలో

రైతులకు దూరమైన సేవలు

నిరుపయోగంగా భవనాలు, పరికరాలు

ల్యాబ్‌ ఉంది..
ప్రజలకు ఆరోగ్య కేంద్రాల వలే మూగజీవాలకు సైతం వైద్య పరీక్షలు అందుబాటులోకి తీసుకురావాలన్న సదుద్దేశంతో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అగ్రిల్యాబ్‌లకు శ్రీకారం చుట్టారు. వైఎస్సార్‌సీపీ హయాంలో జిల్లా వ్యాప్తంగా రూ.5.53 కోట్లతో ఏడు నియోజకవర్గాల్లో ఒక్కొక్కటి చొప్పున నిర్మించి 2023లోనే అందుబాటులోకి తీసుకొచ్చారు. వ్యవసాయ, మత్స్య, పశుసంవర్థక శాఖలను కలుపుతూ ఏర్పాటు చేసిన ఈ అగ్రిల్యాబ్‌లు చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ప్రస్తుతం ఆశించిన స్థాయిలో సేవలు అందడం లేదు. ఇందుకు మాడుగుల నియోజకవర్గంలో ఉన్న అగ్రిల్యాబే నిదర్శనం. ఇక్కడ 2024 నుంచి ల్యాబ్‌ టెక్నీషియన్‌ లేక సేవలు పూర్తిగా నిలిచిపోయాయి.

మాడుగుల: రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పశువైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా రూ.5.53 కోట్లతో 7 అగ్రి టెస్టింగ్‌ ల్యాబ్‌లను ఏర్పాటు చేసింది. 2023లో ప్రారంభమైన ఈ ల్యాబ్‌ల సేవలు ప్రస్తుతం ఆశించిన స్థాయిలో అందడం లేదు. ముఖ్యంగా మాడుగుల నియోజకవర్గంలో రూ.79 లక్షల వ్యయంతో నిర్మించిన డాక్టర్‌ వైఎస్సార్‌ అగ్రి టెస్టింగ్‌ ల్యాబ్‌లో ల్యాబ్‌ టెక్నీషియన్‌ లేకపోవడంతో సేవలు అందడం లేదు. జూలై 8, 2023న ప్రారంభమైన ఈ ల్యాబ్‌ ద్వారా పశువులకు సంబంధించిన రక్త, పేడ, మూత్ర పరీక్షలు, పాల నాణ్యత, దిగుబడి సమస్యల నిర్ధారణతో పాటు విత్తనాల మొలకశాతం, ఎరువుల నాణ్యత పరీక్షలు వేగంగా నిర్వహించేవారు. గంటలో ఫలితాలు అందించే ఆధునిక పరికరాలు అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే సిబ్బంది కొరతతో ప్రస్తుతం సేవలు అందడం లేదు. దీంతో రైతులు నమూనాలను చోడవరం, అనకాపల్లి వంటి దూర ప్రాంతాలకు పంపించాల్సి వస్తోంది. పరీక్షల ఫలితాలు ఆలస్యంగా రావడంతో పశువులకు తగిన సమయంలో చికిత్స అందడం లేదని పాడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement