గతంలో పశువులకు వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం వ్యయ ప్రయాసలతో విశాఖ వెళ్లేవాళ్లం. మాజీ సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే పశువులకు బాగోకపోతే టోల్‌ప్రీ నంబరు 1962కు సమాచారం అందిస్తే పశువుల పాకల వద్దకు పశు అంబులెన్స్‌లు వచ్చి ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ప్రాంతీయ పశువైద్యశాలకు తరలించే సౌకర్యం కల్పించారు. అక్కడ అగ్రి టెస్టింగ్ ల్యాబ్‌లో 15 నిమిషాల్లో పరీక్షలు నిర్వహించి వ్యాధి నిర్ధారణ చేసి, మందులు అందజేసేవారు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా పశువులకు వైద్యం అందేది. ప్రస్తుతం మాడుగుల అగ్రి ల్యాబ్‌లో టెక్నీషియన్ లేకపోవడంతో శాంపుల్స్ తీసుకుని చోడవరం, అనకాపల్లి పంపిస్తున్నారు. దీంతో సకాలంలో వైద్యం అందడం లేదు.
– తంటపురెడ్డి బన్నీ, పాడి రైతు, కొత్తపట్నం, అవురువాడ వీరానారాయణం పంచాయతీ


