అంతర్గత నిధుల ఆరబోత! | - | Sakshi
Sakshi News home page

అంతర్గత నిధుల ఆరబోత!

Oct 3 2026 1:26 AM | Updated on Oct 3 2026 1:26 AM

రూ.250 కోట్ల పనులు బయటి సంస్థకు

రూ.300 కోట్లు ఫైనాన్స్‌ కార్పొరేషన్‌కు

వర్సిటీ ఇంజినీరింగ్‌ విభాగం ఉండగా పనులు ఏపీఈడబ్ల్యూఐడీసీకి?

పెరిగిన అంచనాలపై అనుమానాలు

వందేళ్ల చరిత్ర కలిగిన విజ్ఞాన ఖని.. ఆంధ్ర విశ్వవిద్యాలయం(ఏయూ)లో ఇప్పుడు విద్యార్థుల చదువులకంటే.. నిధుల మళ్లింపు, అడ్డగోలు అంచనాల పెంపు హాట్‌ టాపిక్‌గా మారాయి! వర్సిటీ ఖజానాలో ఉన్న సొమ్మును ఎవరికి నచ్చినట్లు వారు ధారాదత్తం చేస్తుంటే.. వర్సిటీ వర్గాలు, అలుమ్ని మాత్రం ‘మా ఏయూకు ఏమైంది?’అంటూ తలలు పట్టుకుంటున్నాయి.

ఏయూలో

విశాఖ విద్య: సొంత ఇంజినీరింగ్‌ విభాగం..సాంకేతిక నిపుణులు.. నిర్మాణ పనుల అనుభవం.. అన్నీ ఉన్నా భారీ పనులు మాత్రం బయట సంస్థకు! మరోవైపు వర్సిటీ అంతర్గత నిధులు రూ.కోట్లలో ఇతర అవసరాలకు మళ్లింపు. ఏకంగా రూ.250 కోట్ల మేర నిర్మా ణ పనులను ఏపీ విద్య, సంక్షేమ మౌలిక సదుపాయా ల అభివృద్ధి సంస్థ(ఏపీఈడబ్ల్యూఐడీసీ)కు అప్పగింత, రూ.300 కోట్లను ఏపీ ఫైనాన్షియల్‌ కార్పొరేషన్‌కు బదలాయింపు, జీతాలు, పెన్షన్లకూ అంతర్గత నిధులు వెచ్చించడం తదితర అంశాలు ఇప్పుడు ఏయూ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

బయటి సంస్థకు రూ.250 కోట్ల పనులు?

ఏయూకు ప్రత్యేక ఇంజినీరింగ్‌ విభాగం ఉంది. నిర్మాణ పనులకు అవసరమైన ఇంజినీర్లు, సాంకేతిక సిబ్బంది, అంచనాల తయారీ, టెండర్ల నిర్వహణ, పనుల పర్యవేక్షణ వంటి వ్యవస్థలు ఉన్నాయి. అయినప్పటికీ రూ.250 కోట్ల విలువైన నిర్మాణ పనులను ఏపీఈడబ్ల్యూఐడీసీకి అప్పగించడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి.

అక్కడ మైనస్‌ 15.. ఇక్కడ 15 ప్లస్‌ 7!

వర్సిటీ వర్గాల ఆరోపణల మేరకు కొన్ని పనులు వర్సిటీ ఇంజినీరింగ్‌ విభాగం ద్వారా 15 శాతం తక్కువకే లభిస్తుండగా, ఏపీఈడబ్ల్యూఐడీసీ ద్వారా చేపట్టే పనులకు 12–15 శాతం ఎక్కువ కోట్‌ చేయడంతో పా టు, దానికి మరో 7 శాతం కన్సల్టెన్సీ చార్జీ అదనం.

రూ.300 కోట్లు ఏపీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌కు!

రిజిస్ట్రార్‌ పరిధిలోని వివిధ ఖాతాలు, అనుబంధ కళాశాలలు, దూరవిద్యా విభాగం ద్వారా సమకూరిన నిధులను సాధారణ రెవెన్యూ ఖాతాలోకి మళ్లించినట్లు వర్సిటీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. అందులో భాగంగా.. జనవరి 29న రూ.150 కోట్లు, ఏప్రిల్‌ 15న మరో రూ.150 కోట్లను ఏపీ ఫైనాన్షియల్‌ కార్పొరేషన్‌కు బదలాయించినట్లు తెలిసింది. దీనిపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కొత్త ఈసీతో పాత నిర్ణయాలకు ‘రాటిఫికేషన్‌’?

జూలై 31న కొత్త ఈసీ ఏర్పడింది.గతంలో తీసుకున్న పలు నిర్ణయాలను రాటిఫికేషన్‌ కోసం కొత్త ఈసీ ముందుంచినట్లు ఆరోపణలున్నాయి. గత ఈసీ అభ్యంతరం వ్యక్తం చేసిన కొన్ని అంశాలను కూడా కొత్త కమిటీ ముందు మళ్లీ ప్రవేశపెట్టి ఆమోదం పొందేందుకు ప్రయత్నించడం విమర్శలకు తావిస్తోంది.

జీతాలు.. పెన్షన్లకూ సొంత నిధులేనా!

ప్రభుత్వ ట్రెజరీ నుంచి రావాల్సిన బ్లాక్‌ గ్రాంట్‌ అందని సమయంలో కొన్ని నెలల జీతాలు, పెన్షన్లు వర్సిటీ అంతర్గత నిధుల నుంచి చెల్లించినట్లు సమాచారం. గతేడాది సెప్టెంబర్‌తో పాటు ఈ ఏడాది తొలి మూడు నెలల్లో ఈ విధంగా చెల్లింపుల వల్ల రూ.180 కోట్లకు పైగా అంతర్గత నిధులకు గండి పడిందని తెలుస్తోంది. ఈ చెల్లింపులను సెప్టెంబర్‌ 29న జరిగిన ఈసీ సమావేశంలో రాటిఫికేషన్‌ కోసం ఉంచి ఆమోదించినట్లు బోగట్టా.

ఏళ్లుగా ఉన్న డిపాజిట్లు ఉపసంహరణ?

పలు జాతీయ బ్యాంకుల్లో సంవత్సరాలుగా ఉన్న వర్సిటీ నిధులను ఉపసంహరించి సాధారణ రెవెన్యూ ఖాతాకు బదలాయించినట్లు ఆరోపణలున్నాయి. అంతర్గత నిధుల వినియోగం పెరుగుతున్న కొద్దీ భవిష్యత్తులో వర్సిటీ ఆర్థిక పరిస్థితిపై ప్రభావం పడుతుందన్న ఆందోళన ఉద్యోగ, అధ్యాపక వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఈ నిధులు ఎవరి నిర్ణయంతో తరలించారు? ఏ ప్రాతిపదికన వినియోగించారు? అన్న ప్రశ్నలకు స్పష్టతనివ్వాలని సిబ్బంది కోరుతున్నారు.

ఊసులో లేని రూ.500 కోట్ల సాయం హామీ

వర్సిటీకి ప్రభుత్వం నుంచి రూ.500 కోట్ల ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చినా ఇప్పటివరకు ఒక్క పైసా కూడా విడుదల కాలేదని వర్సిటీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు వర్సిటీ అంతర్గత నిధులను భారీగా ఖర్చు చేయడం, ఇతర సంస్థలకు బదలాయించడం ఎందుకనే ప్రశ్న తలెత్తుతోంది.

కబడ్డీ సబ్‌ జూనియర్‌ జిల్లా జట్టు ఎంపిక రేపు

అనకాపల్లి: ఏపీ అంతర్‌ జిల్లాల 36వ సబ్‌ జూనియర్‌ కబడ్డీ పోటీలకు అనకాపల్లి జిల్లా జట్టు ఎంపిక ఆదివారం ఉదయం 9 గంటలకు స్థానిక జీవీఎంసీ గాంధీనగర్‌ హైస్కూల్‌లో నిర్వహించనున్నట్లు అనకాపల్లి కబడ్డీ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు శాంతకుమారి, దాడి శ్యామ్‌ప్రసాద్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికలో పాల్గొనే క్రీడాకారులు 2010 డిసెంబర్‌ 12 తరువాత జన్మించి ఉండాలని పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం బాలురు 60 కిలోలు, బాలికలు 55 కిలోల లోపు బరువు ఉండాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9705143380 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.

ఇంటర్‌ విద్యార్థిని అదృశ్యం

యలమంచిలి రూరల్‌: మున్సిపాలిటీ పరిధి పెదపల్లికి చెందిన బంగారు గీతిక(16) అదృశ్యమైనట్టు యలమంచిలి ట్రాఫిక్‌ ఎస్‌ఐ బెజవాడ రామకృష్ణ తెలిపారు. యలమంచిలి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న గీతిక గురువారం ఉదయం 10 గంటలకు ఇంటి నుంచి కళాశాలకు బయలుదేరి వెళ్లి సాయంత్రం తిరిగి ఇంటికి చేరుకోలేదు. కుటుంబ సభ్యులు ఆమె కోసం వెతికినా ఆచూకీ లభించలేదు. పుట్టుకతోనే మూగ, చెవుడుతో బాధపడుతున్న ఆమె కాలేజీ యూనిఫాంతోనే ఇంటి నుంచి వెళ్లినట్టు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తండ్రి అప్పారావు పేర్కొన్నాడు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు. ఆమె ఆచూకీ తెలిస్తే 9490617629, 9440796104 నంబర్లకు ఫోన్‌ చేసి సమాచారం అందించాలని ఆయన కోరారు.

అభ్యంతరాలున్నా.. అదే సంస్థకు పనులు!

ఏపీఈడబ్ల్యూఐడీసీపై గతంలోనూ అభ్యంతరాలున్నట్లు వర్సిటీ వర్గాలు చెబుతున్నాయి. రూసా ఫేజ్‌–1లో భాగంగా 2016–18 మధ్య చేపట్టిన కొన్ని పనుల విషయంలో అప్పటి వీసీ జి.నాగేశ్వరరావు 2018లో ప్రభుత్వానికి లేఖ రాశారు. అందులో సంస్థ అదనంగా వసూలు చేస్తున్న 7 శాతం కన్సల్టెన్సీ చార్జీని ప్రస్తావించినట్లు సమాచారం. ఆ తరువాత వీసీ ప్రసాద్‌రెడ్డి హయాంలో వర్సిటీ ఇంజినీరింగ్‌ విభాగం ద్వారా పనులు చేపట్టడం వల్ల నిధులు ఆదా అయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తాజా అంచనాల ఆమోదంపై సందేహాలు ముసురుకుంటున్నాయి.

ఈస్ట్‌కోస్ట్‌కు అదనపు కోచ్‌

తాటిచెట్లపాలెం: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా షాలిమర్‌–చర్లపల్లి (08045) ఈస్ట్‌కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌కు ఈనెల 3 నుంచి 7వ తేదీ వరకు అదనంగా ఒక థర్డ్‌ ఏసీ కోచ్‌ను జత చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

ఆరు మాసాల్లోనే అంచనాలు మూడింతలు!

తొలుత ఏయూ ఇంజినీరింగ్‌ విభాగం రూ.45.75 కోట్లతో ఇంజినీరింగ్‌ కళాశాల సెంటినరీ బాయ్స్‌ హాస్టల్‌, రూ.34.80 కోట్లతో సైన్స్‌ కళాశాల గర్‌ల్స్‌ హాస్టల్‌, రూ.14.50 కోట్లతో ఇంజినీరింగ్‌ కళాశాల మెగా మెస్‌ నిర్మాణ అంచనాలు రూపొందించింది. దీన్ని మార్చి 31న జరిగిన పాలక మండలి(ఈసీ) సమావేశంలో ఆమోదించారు. అవే పనులను ఏపీఈడబ్ల్యూఐడీసీకి అప్పగించేటపుడు అంచనాలు గణనీయంగా పెంచడం ఆరోపణలకు తావిస్తోంది.

పెరిగిన భారీ అంచనాలు

బాయ్స్‌ హాస్టల్‌ – రూ.94.75 కోట్లు

ఉమెన్స్‌ హాస్టల్‌ – రూ.73 కోట్లు

మెగా మెస్‌ – రూ.42.40 కోట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement