గత ప్రభుత్వంలో రెండేళ్లు కరోనా వచ్చినపుడు మా వలంటీర్లంతా ఇంటింటికి తిరిగి వైద్య సేవలతో పాటు అప్పటి జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అందించిన ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజలకు అందేలా చేశాం. ఉదయం నుంచి రాత్రి వరకు పనిచేస్తే మాకు నెలకు రూ.5 వేలు జీతం ఇస్తేనే ప్రభుత్వ నిధులు వృధా చేస్తున్నారని చంద్రబాబు డప్పు కొట్టేవారు. ఇప్పుడు సోషల్ మీడియా పేరిట తమ వారికి వేల జీతాలు దోచిపెట్టేలా ప్రభుత్వ తీరు కనిపిస్తుంది. – మజ్జి సోమేష్, మాజీ వలంటీర్, పొట్టిదొరపాలెం, బుచ్చెయ్యపేట మండలం


