ఇల్లు కూల్చే సమయంలో నా భార్య చావుబతుకుల మధ్య ఉంది. ఇల్లు ఖాళీ చేయడానికి సమయం కోరినా పట్టించుకోలేదు. నిర్దాక్షిణ్యంగా ఇంటి యంత్రాల సాయంతో కూల్చేసారు. ఇది చూసి నా భార్య ప్రాణాలొదిలేసింది. అయినా అధికారులకు జాలి కలగలేదు. ఇంటిని పడగొట్టేసారు. నష్టపరిహారం పూర్తిగా ఇవ్వలేదు. నా కొడుక్కి ప్యాకేజీ ఇవ్వాలి..అంతవరకు ఇల్లు ఖాళీ చేయను అని చెప్పినా వినలేదు. నా కొడుక్కి, మనవరాలికి నష్టపరిహారం కోసం రెండేళ్లుగా తిరుగుతున్నాను.. పట్టించుకోవడం లేదు.
–రావి తాతారావు, పాటిమీద గ్రామం


