బధిరులకు ఉపాధి కల్పనకు కృషి | - | Sakshi
Sakshi News home page

బధిరులకు ఉపాధి కల్పనకు కృషి

Sep 27 2026 1:10 AM | Updated on Sep 27 2026 1:10 AM

● సైన్‌ లాంగ్వేజ్‌ ఇంటర్‌ప్రిటర్‌ నియామకం

● కలెక్టర్‌ విజయకృష్ణన్‌

తుమ్మపాల: బధిరుల సంక్షేమానికి ప్రభుత్వం ఎల్లవేళలా కృషి చేస్తుందని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ తెలిపారు. ప్రపంచ సైన్‌ లాంగ్వేజ్‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ప్రత్యేకంగా సైన్‌ లాంగ్వేజ్‌ ఇంటర్‌ప్రిటర్‌ను నియమించనున్నట్టు తెలిపారు. జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న పరిశ్రమల్లో బధిరులు, మూగవారు తమ విద్యార్హతలకు అనుగుణంగా ఉద్యోగ అవకాశాలు పొందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. బధిరులకు ఎదురయ్యే సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు జి.అనూష, డీఆర్‌ఓ వై. సత్యనారాయణరావు, డీఈఓ నాగేశ్వరరావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement