పురపాలిక ఎన్నికల్లో జెండా ఎగురవేస్తాం | - | Sakshi
Sakshi News home page

పురపాలిక ఎన్నికల్లో జెండా ఎగురవేస్తాం

Sep 27 2026 1:10 AM | Updated on Sep 27 2026 1:10 AM

● కూటమి అరాచక పాలననుప్రజల్లోకి తీసుకెళ్లండి

● మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్‌ గణేష్‌

సమావేశానికి హాజరైన మున్సిపాలిటీ నాయకులు

మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్‌ గణేష్‌

నర్సీపట్నం: పురపాలిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ జెండా ఎగురవేద్దామని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో మున్సిపాలిటీ నాయకులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా ఎదుర్కోనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. 40 వార్డుల్లో పోటీ చేసి తీరుతామన్నారు. వార్డుల వారీగా నాయకులు చర్చించుకుని గెలిచే వ్యక్తుల పేర్లను తన దృష్టికి తీసుకురావాలన్నారు. అందరి ఆమోదంతో అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు. అందరూ సమన్వయంతో పని చేసి అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలన్నారు. పార్టీకి కార్యకర్తలే వెన్నెముక అని అన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అందించిన సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అవలంబిస్తున్న మోసపూరిత విధానాలు, ఇచ్చిన దగాకోరు హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లి వైఎస్సార్‌సీపీ విజయానికి మద్దతు కూడగట్టాలన్నారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల సన్యాసిపాత్రుడు, మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ బోడపాటి సుబ్బలక్ష్మి, మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ కోనేటి రామకృష్ణ, పార్టీ టౌన్‌ అధ్యక్షుడు ఏకా శివ, స్టేట్‌ యూత్‌ వింగ్‌ నాయకుడు చింతకాయల వరుణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement