కశింకోట: కశింకోటలోని హజరత్ సయ్యద్ అబ్దుల్ అజీజ్ షా ఖాదరీబాబా దర్గా ఉరుసు ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. చివరి రోజు గురువారం సాయంత్రం చిరాగి (దీపారాధన) ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దర్గా ప్రాంగణంలో ముస్లింలు, భక్తులు దీపారాధన చేశారు. దర్గా వద్ద ఖురాన్ పఠనం, ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. వేడుకల్లో భాగంగా మైసూర్‌కు చెందిన గాయకురాలు రోష్ని, బెంగళూరుకు చెందిన ఖాదర్ నాజర్ బృందం ఆధ్వర్వంలో బుధవారం రాత్రి నిర్వహించిన ఖవ్వాలీ ఆకట్టుకుంది.
కశింకోటలోని సయ్యద్ అబ్దుల్ అజీజ్ షా ఖారదీబాబా దర్గా వద్ద దీపారాధన


