విస్తారంగా వర్షాలు | - | Sakshi
Sakshi News home page

విస్తారంగా వర్షాలు

Sep 24 2026 1:54 AM | Updated on Sep 24 2026 1:54 AM

● అల్పపీడన ప్రభావంతో జోరుగా వానలు ● మూడు రోజుల్లో 112.7 మి.మీ. వర్షపాతం ● జిల్లా సగటు 89.3 మి.మీ.

తుమ్మపాల : అల్పపీడన ప్రభావంతో జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం నుంచి బుధవారం సాయంత్రం వరకు పలు మండలాల్లో భారీ వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా పరవాడ, కోటవురట్ల, నక్కపల్లి, సబ్బవరం, మాకవరపాలెం మండలాల్లో 100 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా గడిచిన రెండు రోజుల్లో నమోదైన వర్షపాతం సగటు 89.3 మిల్లీమీటర్లుగా ఉంది. పరవాడ మండలంలో అత్యధికంగా 112.7 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత కోటవురట్ల, నక్కపల్లి మండలాల్లో చెరో 107 మిల్లీమీటర్లు, సబ్బవరం మండలంలో 103.9 మిల్లీమీటర్లు, మాకవరపాలెం మండలంలో 101 మిల్లీమీటర్లు. వర్షపాతం నమోదైంది. అనకాపల్లి మండలంలో 98.7 మిల్లీమీటర్లు, చోడవరం మండలంలో 98.5 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. బుధవారం ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నమోదైన వర్షపాతంలో నక్కపల్లిలో 47.4 మిల్లీమీటర్లు, మాకవరపాలెంలో 52.4 మిల్లీమీటర్లు నమోదైంది. వర్షాలతో లోతట్టు ప్రాంతాలు, వ్యవసాయ భూముల్లో నీరు చేరే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే ఖరీఫ్‌ సాగులో ఉన్న పంటలకు ఈ వర్షాలు కొంతవరకు ప్రయోజనం కలిగించే అవకాశం ఉన్నప్పటికీ, అధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతాల్లో పొలాల్లో నీరు నిల్వ ఉండకుండా రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. పలు చోట్ల రోడ్లు చెరువులను తలపించేలా తయారయ్యాయి. రోడ్లపై గుంతల్లో నీరు చేరడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

మండలాల వారీగా వర్షపాతం వివరాలు (మిల్లీమీటర్లు.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement