పోలీసు యంత్రాంగం సన్నద్ధం | - | Sakshi
Sakshi News home page

పోలీసు యంత్రాంగం సన్నద్ధం

Sep 24 2026 1:54 AM | Updated on Sep 24 2026 1:54 AM

తుఫాన్‌ రక్షిత చర్యలకు

అనకాపల్లి : తుఫాన్‌ ప్రభావం దృష్ట్యా జిల్లాలో ఎలాంటి అత్యవసర పరిస్థితులు తలెత్తినా ఎదుర్కొనేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం పూర్తి సన్నద్ధంగా ఉందని ఎస్పీ తుహిన్‌ సిన్హా బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి, అవసరమైతే వారిని తుఫాన్‌ పునరావాస కేంద్రాలు, షెల్టర్లకు సురక్షితంగా తరలించే విధంగా ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ, ఇరిగేషన్‌ శాఖలతో సమన్వయం చేసుకుంటూ నిరంతరం క్షేత్ర స్థాయిలో పోలీస్‌ వ్యవస్థ పనిచేస్తుందని, భారీ వర్షాలు, ఈదురు గాలుల వల్ల రోడ్లపై చెట్లు కూలిపోతే వెంటనే తొలగించి రాకపోకలకు అంతరాయం లేకుండా ప్రత్యేక దృష్టి సాఽరించామన్నారు. నక్కపల్లి రూరల్‌ సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో 25 మంది సభ్యులతో ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు (రాష్ట్ర విపత్తుల ప్రతిస్పందన బృందం) రంగంలో సిద్ధంగా ఉన్నాయన్నారు. వర్షం నిరంతరం కురుస్తున్నప్పటికీ, రాజయ్యపేట వద్ద సముద్ర తీర ప్రాంతం సాధారణ స్థితిలోనే ఉందని, ఉపమాక, హెటిరో చెరువుల నీటి మట్టాలు నిలకడగా ఉన్నాయన్నారు. తాండవ రిజర్వాయర్‌ వద్ద పరిస్థితి సురక్షితంగా ఉన్నట్లు నర్సీపట్నం రూరల్‌ సీఐ రేవతమ్మ ఇరిగేషన్‌ డీఈతో కలిసి పర్యవేక్షణ చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం రిజర్వాయర్‌లో నీటి మట్టం 362 అడుగులకు చేరుకోగా, పూర్తి సామర్థ్యం 378 అడుగులుగా ఉందని, ఎటువంటి ప్రమాదం లేదని, పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నారు.

కాజ్‌వేల పరిశీలన – మరమ్మతులు

ఎడతెరిపి లేని వర్షాల నేపథ్యంలో బుచ్చెయ్యపేట ఎస్‌ఐ మనోజ్‌ కుమార్‌ వడ్డాది, విజయరామరాజుపేట కాజ్‌వేలను పరిశీలించి ప్రజలను అప్రమత్తం చేయడం జరిగిందని ఎస్పీ తెలిపారు. వడ్డాది వద్ద విజయరామరాజుపేట కాజ్‌వేకి స్వల్పంగా గండి పడగా, ఆర్‌అండ్‌బీ అధికారులతో సమన్వయం చేసుకొని వెంటనే మరమ్మతు పనులు చేపట్టామన్నారు. ప్రజలు ఆందోళన చెందవద్దని, అత్యవసర సమయాల్లో పోలీసు శాఖ, స్థానిక యంత్రాంగాన్ని సంప్రదించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement