కొత్త పరిశ్రమలకు పూర్తి సహకారం | - | Sakshi
Sakshi News home page

కొత్త పరిశ్రమలకు పూర్తి సహకారం

Sep 24 2026 1:36 AM | Updated on Sep 24 2026 1:36 AM

● ఈ–పంట నమోదు వేగవంతం ● కలెక్టర్‌ విజయకృష్ణన్‌

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ విజయకృష్ణన్‌

తుమ్మపాల: కొత్త పరిశ్రమల స్థాపనకు, నూతన ప్రాజెక్టుల ఏర్పాటుకు పూర్తి సహకారం అందిస్తామని, సింగిల్‌ డెస్క్‌ విధానంలో పరిశ్రమలకు అవసరమైన అనుమతులు, క్లియరెన్సుల ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించిన జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ (డీఐఈపీసీ) సమావేశంలో పరిశ్రమల అభివృద్ధికి సంబంధించిన అంశాలపై ఆమె మాట్లాడుతూ పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అనుమతులను నిర్ణీత సమయంలో మంజూరు చేయాలన్నారు. పారిశ్రామికవేత్తలు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పరిష్కరించాలని ఆదేశించారు. కొత్త పరిశ్రమల ద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు జిల్లా ఆర్థికాభివృద్ధికి దోహదపడేలా చర్యలు చేపట్టాలని సూచించారు.

ఈ–పంట నమోదు త్వరగా పూర్తి చేయాలి

జిల్లాలో 2026–27 ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి ఈ–పంట నమోదును త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయ వీసీ సమావేశ మందిరంలో జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని ధాన్యం మిల్లులను తనిఖీ చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ధాన్యం సేకరణ సమయంలో అవసరమైన జీపీఎస్‌ అమర్చిన వాహనాలను సిద్ధంగా ఉంచాలని జిల్లా రవాణా అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జేసీ శౌర్యమాన్‌ పటేల్‌, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి పి.కె.పి.ప్రసాద్‌, ఇన్‌చార్జి ఆర్డీఓ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement