● కలెక్టర్ విజయకృష్ణన్
మునగపాక: చెరువులను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. స్థానిక సంతబయలు శీలప్పన్న చెరువు శుభ్రత పనులను శనివారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి మండలంలో ఒక చెరువును శుభ్రపరిచేలా చూడాలన్నారు. నీరు వృథాగా పోకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎంపీడీవో ఎం.ఉషారాణి,తహసీల్దార్ ఎ.సంధ్య, డిప్యూటీ ఎంపీడీవో సోమరాజు, పంచాయతీ కార్యదర్శి రమేష్, ఉపాధి హామీ పథకం ఏపీవో శివ, మాజీ సర్పంచ్ దిమ్మల అప్పారావు తదితరులు పాల్గొన్నారు.


