గొలుగొండ: ‘రాష్ట్రంలో కూటమి పాలన దుర్మార్గంగా ఉంది, ఇటువంటి దగాకోరు ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి వైఎస్సార్‌సీపీ శ్రేణులు సమష్టిగా పనిచేయాలి, త్వరలో జరగే స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థులకు తగిన గుణపాఠం చెప్పాలి’ అని వైఎస్సార్‌సీపీ రీజనల్ కో– ఆర్డినేటర్ కురసాల కన్నబాబు పిలుపునిచ్చారు. గొలుగొండ మండలం పాలకపాడు గ్రామంలో శుక్రవారం వైఎస్సార్‌సీపీ నర్సీపట్నం నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి నియోజకవర్గంలోని నాలుగు మండలాలతోపాటు నర్సీపట్నం మున్సిపాలిటీ నుంచి నాలుగు వేలకుపైగా కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. ఈ సందర్భంగా కురసాల కన్నబాబు మాట్లాడుతూ ఇటువంటి మారుమూల గ్రామానికి ఇంత పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు మేరకు త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతీ గ్రామం, వార్డు, మున్సిపాలిటీ నుంచి బలమైన అభ్యర్థులను బరిలో నిలపాలన్నారు. ప్రజా సమస్యలు ఎండగట్టి కూటమి నేతలను ఓడించాలని పార్టీ కేడర్‌కు పిలుపునిచ్చారు.
కార్యకర్తలకు అండగా ఉంటాం :
మాజీ ఎమ్మెల్యే గణేష్
స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయమే లక్ష్యం
విశాఖ, విజయనగరం జిల్లాల రీజనల్ కో–ఆర్డినేటర్ కురసాల కన్నబాబు
సీఎం రమేష్‌కు అనకాపల్లి జిల్లా వాసులు బుద్ధి చెప్పాలి: అమర్‌నాథ్
హామీలు విస్మరించిన కూటమి : మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్
పాకలపాడులో నియోజకవర్గ స్థాయి విస్తృత స్థాయి సమావేశం
వేలాదిగా తరలివచ్చిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు, అభిమానులు


