నేత్రపర్వంగా ఉపమాక వెంకన్న బ్రహ్మోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

నేత్రపర్వంగా ఉపమాక వెంకన్న బ్రహ్మోత్సవాలు

Sep 19 2026 4:20 AM | Updated on Sep 19 2026 4:20 AM

నక్కపల్లి: ప్రముఖ పుణ్యక్షేత్రం ఉపమాక వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వామివారి మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం, నిత్యార్చనలు నిర్వహించారు. కొండ దిగువన ఉత్సవమూర్తులకు, క్షేత్రపాలకుడు వేణుగోపాల స్వామికి, ఆండాళ్లమ్మవారికి నిత్యార్చనలు పూర్తిచేసిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. తరువాత నిత్యసేవాకాలం, బాల భోగ, రాజభోగ నివేదనలు పూర్తిచేశారు. తదుపరి సుదర్శన పెరుమాళ్లను చిన్నపల్లకిలోను, ఉభయ దేవేరులతో కూడిన స్వామివారిని ఆంజనేయ వాహనంలో ఉంచి తిరువీధి సేవలు నిర్వహించా రు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు తిరువీధి సేవల్లో కోలాటం నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో ప్రధానార్చకులు గొట్టుముక్కల వరప్రసాద్‌, అర్చక స్వాములు కృష్ణ మాచార్యులు, శేషాచార్యులు, సాయి ఆచార్యులు పాల్గొన్నారు.

ఏయూ దూరవిద్య ప్రవేశాల గడువు పొడిగింపు

విశాఖ విద్య: ఆంధ్ర విశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రంలో ప్రవేశాలకు దరఖాస్తు గడువు ను అక్టోబర్‌ 13వ తేదీ వరకు పొడిగించినట్లు దూరవిద్య సంచాలకులు ఆచార్య డీఏ నాయుడు తెలిపారు. యూజీసీ–డీఈబీ సూచనలకు అను గుణంగా ఓపెన్‌ అండ్‌ డిస్టెన్స్‌ లెర్నింగ్‌ (ఓడీఎల్‌) ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌ లెర్నింగ్‌ కోర్సులకు ఈ గడువు పొడిగించినట్లు పేర్కొన్నారు. జూలై–ఆగస్టు 2026 సెషన్‌కు సంబంధించి ప్రవేశాలు పొందాలనుకునే విద్యార్థులు అక్టోబర్‌ 13లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఓడీఎల్‌ (ఆఫ్‌లైన్‌) కోర్సుల ప్రవేశాలు, ఆన్‌లైన్‌ కోర్సుల వివరాల కోసం ఏయూ అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాలని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement