‘డిజిటల్‌ హెల్త్‌’తో మెరుగైన వైద్యసేవలు | - | Sakshi
Sakshi News home page

‘డిజిటల్‌ హెల్త్‌’తో మెరుగైన వైద్యసేవలు

Sep 19 2026 4:20 AM | Updated on Sep 19 2026 4:20 AM

అనకాపల్లి: దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు మెరుగైన ప్రాథమిక ఆరోగ్యసేవలు అందించడంలో డిజిటల్‌ ఆరోగ్య సాంకేతికతలనుఉపయోగించుకోవాలని డీఎంహెచ్‌వో డాక్టర్‌ అచ్యుతకుమారి సూచించారు. స్థానిక రింగ్‌రోడ్డు వద్ద ఓ ప్రైవేట్‌ ఫంక్షన్‌ హాల్లో శుక్రవారం జిల్లాలోని వివిధ పీహెచ్‌సీ వైద్యులకు మల్టీపుల్‌ లాంగ్‌ టర్మ్‌ కండిషన్‌ ప్రాజెక్టు, సెంటర్‌ ఫర్‌ క్రానిక్‌ డిసీజ్‌ కంట్రోల్‌ ఆధ్వర్యంలో డిజిటల్‌హెల్త్‌పై ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆస్పత్రికి వచ్చిన ప్రతి రోగి వివరాలు డిజిటలైజేషన్‌ చేయడం వల్ల వ్యాధి పరిస్థితిని తెలుసుకోవచ్చన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలో డిజిటల్‌ హెల్త్‌ టెక్నాలజీల విని యోగాన్ని బలోపేతం చేయడం, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు సమర్థంగా, నిరంతర వైద్యసేవలు అందించేందుకు వైద్యాధికారులు సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో శిక్షకులు డాక్టర్‌ ఎస్‌.వి.నిఖిల్‌, సీనియర్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ గుమ్మిడి బాలాజీ, రీసెర్చ్‌ మేనేజర్‌ డాక్టర్‌ మోనల్‌, పీహెచ్‌సీ వైద్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement