నియోజకవర్గంలో కార్యకర్తలకు ఐడీ కార్డులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కురసాల కన్నబాబు, అమర్‌నాథ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 12 వేలకు పైగా గుర్తింపు పొందిన కార్యకర్తలు నర్సీపట్నం నియోజకవర్గంలో ఉన్నారని ప్రశంసించారు. దీన్ని గుర్తించి పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సైతం మాజీ ఎమ్మెల్యే గణేష్‌ను మెచ్చుకొని ఇతర జిల్లాల నేతలు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మహిళా విభాగం జోన్–1 వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్లె అనురాధ, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు లోచల సుజాత, నర్సీపట్నం సీనియర్ నాయకులు చింతకాయల సన్యాసిపాత్రుడు, వైద్యుడు లక్ష్మీకాంత్, సీనియర్ నాయకులు యర్రా పాత్రుడు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్‌లు, నాయకులు, పార్టీ అనుబంధ కమిటీల సభ్యులు పాల్గొన్నారు.


