ముగ్గురు అనాథ పిల్లలకు అధికారుల అండ | - | Sakshi
Sakshi News home page

ముగ్గురు అనాథ పిల్లలకు అధికారుల అండ

Sep 18 2026 1:03 AM | Updated on Sep 18 2026 1:03 AM

అనకాపల్లి: నిరాశ్రయ స్థితిలో ఉన్న గండేపల్లి ఉషా కుటుంబానికి జిల్లా యంత్రాంగం అండగా నిలిచింది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఉషా ఈ నెల 16న మృతి చెందడంతో ఆమె ముగ్గురు చిన్నారులు అనాథలుగా మిగిలిపోయారు. ఈ నేపథ్యంలో జిల్లా బాలల సంరక్షణ విభాగం, మహిళా శిశు సంక్షేమ శాఖ, వన్‌స్టాప్‌ సెంటర్‌ సమన్వయంతో తక్షణ చర్యలు చేపట్టారు. ఇద్దరు బాలురను సబ్బవరంలోని జనరేటివ్‌ యువ చైల్డ్‌ కేర్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చేర్పించగా, బాలికను వన్‌స్టాప్‌ సెంటర్‌లో సంరక్షణలోకి తీసుకున్నట్టు వన్‌స్టాప్‌ సెంటర్‌ జిల్లా కోఆర్డినేటర్‌ మనోహర్‌ తెలిపారు. బాలికకు చట్టబద్ధంగా దత్తత కల్పించే దిశగా ప్రత్యేక చర్యలు ప్రారంభించామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement