విద్యార్ధి సతీష్‌ను అభినందిస్తున్న ఎస్‌ఐ తారకేశ్వరరావు , హెచ్‌ఎం సత్యనారాయణ
నాతవరం : విద్యార్థులకు విద్యతో పాటు ఆటలు చాలా అవసరమని నాతవరం ఎస్‌ఐ వై.తారకేశ్వరరావు అన్నారు. స్థానిక హైస్కూల్‌లో 10వ తరగతి చదువుతున్న అంకంరెడ్డి సతీష్ సత్యసాయి పుట్టపర్తి జిల్లాలో ఈనెల 12,13,14, తేదీలలో జరిగిన రాష్ట్ర స్థాయి బేస్‌బాల్ పోటీలలో పాల్గొని క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. సతీష్ ప్రతిభను గుర్తించి గురువారం నాతవరం హైస్కూల్‌లో ఎస్‌ఐతో పాటు హైస్కూల్ ప్రదానోపాధ్యాయుడు కూండ్రపు సత్యనారాయణ అభినందించారు. మారుమూల ప్రాంతంలో ఉన్న విద్యార్థులు సైతం తమ నైపుణ్యం, ప్రతిభ చూపించేందుకు ఆటల పోటీలు ఎంతో దోహద పడతాయన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు సూర్యదేవుళ్లు, వలసయ్యనాయుడు, సిబ్బంది పాల్గొన్నారు.


