చెత్త రహిత గ్రామాలు లక్ష్యంగా ప్రణాళికలు | - | Sakshi
Sakshi News home page

చెత్త రహిత గ్రామాలు లక్ష్యంగా ప్రణాళికలు

Sep 18 2026 1:03 AM | Updated on Sep 18 2026 1:03 AM

ర్యాలీ నిర్వహిస్తున్న డీఎల్‌డీవో మంజుల, జిల్లా పంచాయతీరాజ్‌ అధికారి సందీప్‌

అనకాపల్లి: జిల్లాలో చెత్త లేని గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసినట్లు డీఎల్‌డీవో మంజుల, పంచాయతీ రాజ్‌ జిల్లా అధికారి సందీప్‌ తెలిపారు. స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం నుంచి నెహ్రూచౌక్‌ వరకూ గురువారం స్వచ్ఛభారత్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వచ్చేనెల 2వ తేదీ వరకూ జిల్లాలో వివిధ ప్రాంతాల్లో స్వచ్ఛ భారత్‌ కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. మన పరిశుభ్రత.. మన ఆరోగ్యంగా జీవించాలన్నారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛభారత్‌ జిల్లా కో ఆర్డినేటర్‌ లోవరాజు, ఎంపీడీవో ఆశాజ్యోతి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement