వ్యక్తిగత విమర్శలు మానుకో.. | - | Sakshi
Sakshi News home page

వ్యక్తిగత విమర్శలు మానుకో..

Sep 18 2026 1:03 AM | Updated on Sep 18 2026 1:03 AM

వ్యక్తిగత విమర్శలు మానుకో.. ● నీలా అడ్డదారిలో ఎదగలేదు.. ● ఎంతో రాజకీయ చరిత్ర ఉన్న కుటుంబం నాది ● ఎంపీ సీఎం రమేష్‌పై మాజీ మంత్రి అమర్‌నాఽథ్‌ ఆగ్రహం

బుచ్చెయ్యపేట : ‘నీలా నాటు సారా తాగి, అమ్మి అడ్డదారిలో వచ్చిన వాడిని కాను..పాలు తాగి రాజకీయ చరిత్ర ఉన్న కుటుంబం నుంచి పైకి వచ్చినవాడిని...’ అంటూ ఎంపీ సీఎం రమేష్‌ను ఉద్దేశించి మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ రీజనల్‌ కో ఆర్డినేటర్‌ గుడివాడ అమర్‌నాఽథ్‌ అన్నారు. బుధవారం చోడవరం నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చిన అనకాపల్లి ఎంపీ సి.ఎం రమేష్‌ మాజీ మంత్రి అమర్‌నాఽథ్‌ను ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా స్పందించారు. గురువారం బుచ్చెయ్యపేట విచ్చేసిన అమర్‌నాఽథ్‌ మాట్లాడుతూ కడపలో ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టి చింతకుంట మునిస్వామి రమేష్‌ వైన నీవు సి.ఎం రమేష్‌గా సొంత పేరు చెప్పకోలేని నీవు నా గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తావా...అంటూ మండిపడ్డారు. మా తాత, నాన్న, నేను ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా ప్రజలకు సేవలందించామని, మాపై అనుచిత వాఖ్యలు చేయడం నీకు తగదన్నారు. నాటు సారా వ్యాపారం చేసుకుంటూ 1989లో బూత్‌ ఏజెంట్‌గా వచ్చిన నీకు ఈ రోజు రూ.వేల కోట్లు ఎలా వచ్చాయో ప్రజలకు చెప్పగలవా అంటూ ప్రశ్నించారు. ఇటు బీజేపీతో, అటు టీడీపీతో రాజకీయ వ్యభిచారం, బ్రోకర్‌ పనులు చేసే నీవు నీతులు మాట్లాడడాన్ని ఇక్కడి ప్రజలు హర్షించరని ఎద్దేవా చేశారు. కడపలో చెల్లని రూపాయివైన నీవు అనకాపల్లి వచ్చి ఇక్కడి పంచభూతాలను దోచుకుంటున్న నీ చరిత్రను ఢిల్లీగడ్డపై తెలిసేలా చేశానన్నారు.

ప్రజలే బుద్ధి చెబుతారు...

అధికారంలోకి వస్తే అభివృద్ధి చేస్తానని మాయమాటలు చెప్పి సి.ఎం రమేష్‌ రెండున్నరేళ్లు అయినా గోవాడ సుగర్‌ ఫ్యాక్టరీలో రైతులకు, ఉద్యోగులకు ఇవ్వాల్సిన రూ.35 కోట్లు నిధులు మంజూరు చేయలేకపోయారని విమర్శించారు. గోవాడ సుగర్‌ ఫ్యాక్టరీని పూర్తిగా మూయించి ఫ్యాక్టరీ భూమిని కారు చౌకగా లాక్కోవడానికి ప్రయత్నించారని అమర్‌నాఽథ్‌ మండిపడ్డారు. అమర్‌నాఽథ్‌ లోకల్‌.. అని చెబుతూ అధికారం కోల్పోతే నీవు ఎవరో కూడా ఇక్కడ ప్రజలకు తెలియదని, ఇకనైనా ఎంపీ వ్యక్తిగత విమర్శలు మానుకుని ప్రజా సంక్షేమానికి కృషి చేస్తే మంచిదని, లేకపోతే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అమర్‌నాఽథ్‌ హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement