అనకాపల్లి: పోలీస్‌శాఖలో విధులు నిర్వహిస్తూ అకాల మరణం చెందిన సిబ్బంది కుటుంబాలకు పోలీస్ శాఖ ఎల్లవేళలా అండగా ఉంటుందని ఎస్పీ తుహిన్ సిన్హా అన్నారు. జిల్లాలో పోలీస్‌శాఖలో విధులు నిర్వహిస్తూ మరణించిన పోలీస్ సిబ్బంది కుటుంబ సభ్యులతో ఆయన తమ కార్యాలయంలో గురువారం సమావేశం నిర్వహించారు. కుటుంబసభ్యుల సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు వారికి ప్రభుత్వం నుంచి రావలసిన జీపీఎఫ్, ఏపీజీఎల్‌ఐ, ఫ్యామిలీ పెన్షన్ తదితర ఆర్థిక ప్రయోజనాలు, కారుణ్య నియామకాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న ఫైళ్లను త్వరితగతిన పరిష్కరించడానికి ప్రభుత్వానికి నివేదిక పంపించడం జరిగిందన్నారు. సాంకేతిక, రికార్డుపరమైన సమస్యలు ఉన్నట్టయితే తక్షణమే పరిష్కారానికి చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. విధులు నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోయిన సిబ్బంది త్యాగాలు మరువలేనివన్నారు. వారి కుటుంబాల సంక్షేమానికి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎల్.మోహనరావు, డీఎస్పీ కె.రవికుమార్, సీఐలు బాల సూర్యారావు, రామకృష్ణారావు, మన్మధరావు, కార్యాలయ పరిపాలనాధికారి (ఏవో) సి.హెచ్.తిలక్ బాబు, ఆఫీస్ సూపరింటెండెంట్ దేవరాజు, ఎస్‌ఐ హరినాథ్ పాల్గొన్నారు.


