సాక్షి, అనకాపల్లి: మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా అనుబంధ విభాగాలతో పాటు మరికొన్ని పార్టీ పదవులను భర్తీ చేస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. పార్టీ జిల్లా కార్యదర్శిగా ఈతా బాబూరావు(యాక్టివిటీ) (యలమంచిలి నియోజకవర్గం), నాయీ బ్రాహ్మణ విభాగం జిల్లా అధ్యక్షుడిగా తుంపాల గణేశ్ (యలమంచిలి నియోజకవర్గం), సోషల్ మీడియా విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉలబాల దేవుడు నాయుడు (చోడవరం నియోజకవర్గం), సోషల్ మీడియా విభాగం జిల్లా కార్యదర్శులుగా గాది శ్రావణ్‌కుమార్ (చోడ వరం నియోజకవర్గం), మందపాక నాగేశ్వరరావు (చోడవరం నియోజకవర్గం), ఇల్లపు శ్రీను (చోడవరం నియోజకవర్గం), యూత్ విభాగం జిల్లా కార్యదర్శులుగా నగిరెడ్డి నాగేశ్వరరావు (యలమంచిలి నియోజకవర్గం), ఐతంశెట్టి రవి (యలమంచిలి నియోజకవర్గం), యూత్ విభాగం రోలుగుంట మండల అధ్యక్షుడిగా వడ్డాది సత్యనారాయణ (చోడవరం నియోజకవర్గం)లను నియమించారు.


