నిరసన ర్యాలీ చేస్తున్న గిరిజన రైతులు
రావికమతం : ఉరవకొండపై ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న బంజరు భూములకు డి. పట్టాలు ఇవ్వండి, గ్రానైట్ క్వారీలను లీజు అనుమతులు ఇవ్వవద్దు అంటూ గురువారం కొమిర నుంచి వీజే పురంలో ప్రజాభిప్రాయ సేకరణ వద్దకు గిరిజన రైతులు ప్లకార్డులతో పాదయాత్ర చేశారు. మండలంలో కొమిర రెవిన్యూ పరిధిలో గల పది మంది గిరిజన రైతులు 8 ఎకరాల్లో జీడి మామిడి వేసి వాటి ద్వారా వచ్చే ఆదాయంతో జీవనం సాగిస్తున్నారు. వి.మాడుగుల మండలం ఉరలోవ రెవిన్యూ పరిధిలో సీతారాం గ్రానైట్, గేలాక్సి, జి.కొండపల్లి గ్రానైట్ క్వారీలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ క్వారీలను ఆనుకొని కవ్వుగుంట, కొమిర బుడ్డిబంద గ్రామాల భూములు ఉన్నాయి. ఈ క్వారీల వల్ల కవ్వుగుంట, కొమిర, బుడ్డిబంద రైతులు, ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై పలుమార్లు నిరసన తెలిపారు. ఈ నెల 10వ తేదీన గ్రానైట్ క్వారీలపై మాడుగుల మండలం వమ్మలి జగన్నాథపురం గ్రామంలో నర్సీపట్నం ఆర్డీవో అధ్యక్షతన సభ నిర్వహించారు. ఎన్నో ఏళ్ల నుంచి బంజరు భూముల్లో జీడి మామిడి తోటలు వేసి వాటి ద్వారా వచ్చే ఆదాయంతో జీవనం సాగిస్తున్నామని, కానీ మాకు పట్టాలు ఇప్పించాలని, క్వారీల వల్ల మా గ్రామాలకు నష్టం వాట్లిలుతుందన్నారు. మా భూములకు పట్టాలు ఇవ్వాలని,గతంలో కొందరికి పట్టాలు ఇచ్చిన భూములను వెబ్ ల్యాండ్‌లో నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావు, గిరిజన సంఘం నాయకులు గోవిందరావు, సీపీఎం నాయకులు నరిసింహమూర్తి పాల్గొన్నారు.


