గవరపాలెం అరుంధతినగర్‌లో పోతురాజు నూకాంబిక ఆలయంలో అమ్మవారిని కరెన్సీతో అలంకరణ
అనకాపల్లి : స్థానిక గవరపాలెం అరుంధతినగర్‌లో స్వయంభువుగా వెలసిన పోతురాజు నూకాంబిక ఆలయంలో అమ్మవారిని ఆలయ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో గురువారం రూ.1,75,000 నగదుతో ప్రత్యేక అలంకరణ చేశారు. ప్రతి ఏడాది వినాయక చవితి అమావాస్య ముందు రోజును పురస్కరించుకుని నూకాంబిక అమ్మవారిని ప్రత్యేక అలంకరణ చేయడం జరుగుతుందని ఆలయ నిర్వహకులు పెట్ల నాగేశ్వరరావు చెప్పారు. ఆలయానికి వచ్చిన భక్తులకు మధ్యాహ్నం అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్ని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


