అనకాపల్లి: జాతీయ లోక్ అదాలత్ ఈనెల 12న జిల్లావ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుందని, కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ తుహిన్ సిన్హా గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ స్టేషన్లు, న్యాయస్థానాల్లో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న రాజీపడదగ్గ కేసులను స్నేహపూర్వక వాతావరణంలో, శాశ్వతంగా పరిష్కరించుకోవడానికి జాతీయ లోక్‌అదాలత్ గొప్ప అవకాశమన్నారు. లోక్ అదాలత్ వల్ల సమయం, ఽనగదు ఆదా, కోర్టుల చుట్టూ తిరిగే శ్రమ తప్పి, సుదీర్ఘ న్యాయ ప్రక్రియకు ముగింపు పడుతుందన్నారు. రాజీమార్గమే రాజమార్గమన్నారు.


