మునగపాక : వరుణదేముడు కరుణించాలని కోరుతూ బుధవారం మండలంలోని మూలపేటలో కప్పాకప్పా నీలాలు కార్యక్రమం నిర్వహించారు. కొంత కాలంగా వర్షాలు కురవక రైతులు పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా వరుణ దేముడు కరుణించాలని కోరుతూ కప్పలను ఊరేగించారు. గ్రామంలోని అన్ని వీధుల గుండా కప్పలకు స్నానాలు చేయిస్తూ ఊరేగింపు చేపట్టారు. రైతులతో పాటు మహిళలు కూడా కార్యక్రమంలో పాల్గొని కప్పలకు పూజలు చేశారు. అనంతరం ప్రసాదం తయారు చేసి అందరికీ పంచిపెట్టారు. కార్యక్రమంలో కాండ్రేగుల గాంధీ, భీశెట్టి నాగేశ్వరరావు, యల్లపు నాగేశ్వరరావుతో పాటు మూలపేట గ్రామస్తులు పాల్గొన్నారు.
వరుణ దేముని కోసం పూజలు


