చీడికాడ: చెదురుమదురుగా కురుస్తున్న వర్షాల కారణంగా కోనాం జలాశయం నీటిమట్టం నెమ్మదిగా పెరుగుతూ ప్రస్తుతం 93.05 మీట ర్లకు చేరుకుంది. 35 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 101.25 మీటర్లు. ఈ జలాశయం కింద ఐదు మండలాల్లో 14,500 ఎకరాల ఆయకట్టు ఉంది. ఎగువ కాలువ పరిధిలో 4,500 ఎకరా లు, దిగువ కాలువ పరిధిలో 10 వేలఎకరాల ఆయకట్టు ఉంది. ప్రస్తుతం ఎగువ కాలువలో నీరు పారే అవకాశం లేదు. మరో 3 మీటర్ల నీటిమట్టం పెరిగితే తప్ప కాలువలకు నీటిని విడుదల చేసే అవకాశం లేదు. ఆయ కట్టు రైతులు వరినారు వేసి నీటి కోసం ఎదురుచూస్తున్నారు. గత ఏడాది ఇదే నెలలో నీటిమట్టం 93.90 మీటర్ల వద్ద ఉన్నా, తర్వాత వర్షాలు కురవడంతో ప్రమాదస్థాయికి చేరుకుంది.
నేడు కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్, రెవెన్యూ క్లినిక్
తుమ్మపాల: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్), రెవెన్యూ క్లినిక్‌ల కార్యక్రమాలను సో మవారం ఉదయం 10 గంటలకు కలెక్టరేట్ సమావేశ మందిరంతో పాటు అన్ని మండల, డివిజన్ స్థాయి కార్యాలయాల్లో నిర్వహించను న్నట్టు కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదివారం ఓప్రకటనలో తెలిపారు. అర్జీదారులు నేరుగా కార్యాలయాలకు చేరు కుని తమ సమస్యలను అధికారులకు తెలియజేయాలని పేర్కొన్నారు. కార్యాలయాలకు రాలేని వారు ఆన్‌లైన్‌లో Meekosam. ap.gov.in వెబ్‌సైట్ ద్వారా అర్జీలను నమోదు చేసుకోవచ్చని తెలిపారు. పీజీఆర్‌ఎస్, రెవెన్యూ క్లినిక్‌లలో సమర్పించిన అర్జీల సమాచారం కోసం టోల్‌ఫ్రీ నంబర్. 1100కు కాల్‌చేసి తెలుసుకోవాలని సూచించారు.


