ఏబీఎన్‌ రాధాకృష్ణను అరెస్టు చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఏబీఎన్‌ రాధాకృష్ణను అరెస్టు చేయాలి

Apr 10 2026 9:57 AM | Updated on Apr 10 2026 9:57 AM

● మహిళలపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి ● జిల్లా వ్యాప్తంగా పోలీసుస్టేషన్లలో రాధాకృష్ణపై వైఎస్సార్‌సీపీ శ్రేణుల ఫిర్యాదులు

సాక్షి నెట్‌వర్క్‌ : జర్నలిస్టు ముసుగులో మహిళలను కించపరుస్తూ ఏబీఎన్‌ చానల్‌లో రోత వ్యాఖ్యలు చేసిన ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణను అరెస్టు చేయాలని వైఎస్సార్‌సీపీ శ్రేణులు జిల్లావ్యాప్తంగా పోలీసుస్టేషన్లలో ఫిర్యాదులు అందించారు.

యలమంచిలి రూరల్‌ : మహిళలను కించపరిచిన ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని వైఎస్సార్‌సీపీ యలమంచిలి సమన్వయకర్త కరణం ధర్మశ్రీ డిమాండ్‌ చేశారు. గురువారం ఆయన స్థానిక పార్టీ నాయకులతో కలిసి యలమంచిలి సీఐ ధనుంజయరావుకు రాధాకృష్ణపై రాతపూర్వక ఫిర్యాదు చేశారు. మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేయ డం భావప్రకటన స్వేచ్ఛ కిందకు ఎలా వస్తుందంటూ ప్రశ్నించారు.

చోడవరం: జర్నలిజం ముసుగులో ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ టీడీపీకి ఏజెంట్‌గా పనిచేస్తున్నారని చోడవరం సమన్వయకర్త అమర్‌నాఽథ్‌ ధ్వజమెత్తారు. పార్టీ శ్రేణులతో కలసి ఎస్‌ఐ కార్తికేయకు రాధాకృష్ణపై ఫిర్యాదు అందించారు.

నర్సీపట్నం : మహిళలపై ఏబీఎన్‌ రాధాకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఆయన వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేకపోతే మహిళల ఆగ్రహానికి గురికాక తప్పదని మాజీ ఎమ్మెల్యే గణేష్‌ హెచ్చరి ంచారు. పార్టీ నాయకులతో ఆయన నర్సీపట్నం టౌన్‌ పోలీసుస్టేషన్‌లో ఎస్‌ఐ రమేష్‌కు రాధాకృష్ణపై ఫిర్యాదు చేశారు.

నక్కపల్లి : పత్రికా విలువలను మంటగలుపుతూ కేవలం చంద్రబాబు, లోకేష్‌ల మెప్పుకోసం ఏబీఎన్‌ రాధాకృష్ణ వైఎస్సార్‌సీపీ నేతలు, మహిళలపై దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు, పార్టీ రాష్ట్రకార్యదర్సి వీసం రామకృష్ణ మండిపడ్డారు. రాధాకృష్ణపై క్రిమినల్‌ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని నక్కపల్లి పోలీస్‌స్టేషన్‌లో సీఐ జె.మురళికి ఫిర్యాదు చేశారు.

కె.కోటపాడు : మహిళల ఆత్మాభిమానం దెబ్బతీయడంతో పాటు వారిని కించపర్చేలా ఏబీఎన్‌ రాధాకృష్ణ వాఖ్యలు ఉన్నాయని మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు అన్నారు. ఏబీఎన్‌ రాధాకృష్ణపై కె.కోటపాడులో రాష్ట్ర వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం జోన్‌–1 వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఈర్లె అనురాధ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కశింకోట : మహిళలపై నీచమైన వ్యాఖ్యలు చేసిన ఏబీఎన్‌ రాధాకృష్ణను వెంటనే అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్‌, ఆ పార్టీ అనకాపల్లి సమన్వయకర్త మలసాల భరత్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు పార్టీ శ్రేణులతోపాటు కలిసి కశింకోట ఎస్‌ఐ మనోజ్‌కుమార్‌కు ఫిర్యాదును అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement