జాతీయ స్థాయి రగ్బీ పోటీల్లో ఇందు ప్రతిభ
అచ్యుతాపురం రూరల్ : జాతీయ స్థాయి రగ్బీ పోటీల్లో ఎంజేపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థిని బి.ఇందు ఉత్తమ ప్రతిభ కనబర్చిందని పాఠశాల ఫిజకల్ డైరెక్టర్ ధర్మిరెడ్డి రాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మంగళవారం స్థానిక విలేకర్లతో మాట్లాడారు. తమిళనాడులో గల జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో ఆదివారం జరిగిన జాతీయ స్థాయి రగ్బీ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ తరపున కాంస్య పతకం సాధించడంలో ఇందు ఉత్తమ ప్రతిభ కనబర్చిందన్నారు. క్రీడాకారిణి ఇందుకి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కె.రాజా రత్నకుమార్, సర్పంచ్ కరెడ్ల బుల్లెమ్మ, మాజీ సర్పంచ్ కరెడ్ల సూర్యప్రకాశ్, స్కూల్ కమిటీ చైర్మన్ యు.ఉష, అధ్యాపకులు అభినందనలు తెలిపారు.


