భూ వివాదంలో ఆరుగురి అరెస్టు
నర్సీపట్నం : గ్రామకంఠం భూమిని తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించిన విషయమై పంచాయతీ కార్యదర్శి ఫిర్యాదు మేరకు ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేశామని రూరల్ సీఐ ఎల్.రేవతమ్మ తెలిపారు. నర్సీపట్నం రూరల్ సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరా వెల్లడించారు. నాతవరం మండలం, లింగంపేట పంచాయతీ పరిధి సర్వే నెంబర్ 46లో పంచాయతీకి చెందిన ఖాళీ గ్రామకంఠం భూమిని తప్పుడు పత్రాలని సృష్టించి రిజిస్టేషన్ చేయించినట్లు జాయింట్ ఇన్‌స్పెక్షన్‌లో రుజువైందన్నారు. ఈ భూ వివాదానికి సంబంధించి ఎల్.నూకరాజు, ఎల్.మంగ, ఎల్.కొండబాబు, ఎల్.నారాయణమూర్తి, పి.సీతారామ నాగజమీలు,ఎల్.వరహాలబాబును అరెస్ట్ చేశామని సీఐ, ఎస్సై తారకేశ్వరరావు తెలిపారు. ప్రభుత్వ భూమిని కాజేసేందుకు తప్పుడు పత్రాలు సృష్టించినందునే చర్యలు తీసుకున్నామని నాతవరం తహసీల్దార్ చందనరేఖ పేర్కొన్నారు.


