3న అప్పన్న డోలోత్సవం | - | Sakshi
Sakshi News home page

3న అప్పన్న డోలోత్సవం

Feb 25 2026 8:59 AM | Updated on Feb 25 2026 8:59 AM

3న అప్పన్న డోలోత్సవం

3న అప్పన్న డోలోత్సవం

సింహాచలం: ఫాల్గుణ పౌర్ణమిని పురస్కరించు కుని మార్చి 3న శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వారి డోలోత్సవాన్ని కొండ దిగువన ఉన్న పుష్కరిణి సత్రం ప్రాంగణంలోని ఉద్యానవన మండపంలో వైభవంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు దేవస్థానం ఈవో జె.వెంకటరావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆ రోజు చంద్రగ్రహణం సంభవిస్తున్న నేపథ్యంలో వైదిక కార్యక్రమాలు, ఉత్సవ నిర్వహణ సమయాల్లో మార్పు లు చేసినట్లు పేర్కొన్నారు. 3న తెల్లవారుజామున ఒంటి గంటకు సుప్రభాత సేవ, 3.30 గంటలకు బాలభోగం, ఆరాధన పూర్తిచేసి.. అనంతరం విష్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, చూర్ణోత్సవం నిర్వహిస్తారు. తెల్లవారుజామున 4 గంట లకు స్వామివారి ఉత్సవమూర్తులను మెట్ల మార్గం ద్వారా కొండ దిగువకు తీసుకొస్తారు. అక్కడ ఉద్యానవన మండపంలో డోలోత్సవం, వసంతోత్సవం నిర్వహిస్తారు. అనంతరం ఉద యం 6 గంటల నుంచి గ్రామ తిరువీధి నిర్వహించి, తిరిగి స్వామివారిని కొండపైకి తీసుకెళ్తారు. భక్తులందరూ ఈ ఉత్సవంలో పాల్గొని స్వామి వారి ఆశీస్సులు పొందాలని ఈవో కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement