టీచర్ల చలో విజయవాడ రేపు
యూటీఎఫ్ కార్యాలయంలో మాట్లాడుతున్న ప్రధాన కార్యదర్శి అంబేడ్కర్
ఆరిలోవ: పీఆర్సీ సాధన కోసం ఈ నెల 17న జరగనున్న చలో విజయవాడ కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు విజయవంతం చేయాలని యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్(యూటీఎఫ్) జిల్లా ప్రధాన కార్యదర్శి టి.ఆర్.అంబేడ్కర్ పిలుపునిచ్చారు. యూనియన్ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు దాసరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కార్యవర్గ సమావేం ఆదివారం నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న అంబేడ్కర్ మాట్లాడుతూ 12వ పీఆర్సీ 2023 నుంచి అమలు కావాల్సి ఉన్నప్పటికీ ఇంతవరకు కమిషన్‌ను నియమించలేదన్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. పీఆర్‌సీ కమిషన్‌ను వెంటనే నియమించాలని డిమాండ్ చేశారు. 29 శాతం ఫిట్‌మెంట్ ప్రకటన, సీపీఎస్ రద్దు, పెండింగ్ డీఏల చెల్లింపు తదితర డిమాండ్ల సాధనకు యూటీఎఫ్ ఆధ్వర్యంలో చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు టి.అప్పారావు, జిల్లా గౌరవాధ్యక్షుడు అనకాపల్లి పైడిరాజు, సహాధ్యక్షుడు ముత్యాలనాయుడు, తదితరులు పాల్గొన్నారు.


