చంద్రబాబు ప్రభుత్వం మహిళలను మోసం చేసింది
నిరుద్యోగ భృతి మాటేది?
రాష్ట్ర బడ్జెట్‌లో ఎలాంటి రాయితీలు, మే లు చేసే అంశాలు ఉంటాయోనని నాలాంటి యువత ఎదు రు చూశారు. కానీ మా ఆశల మీద ప్రభుత్వం నీళ్లు చల్లింది. ఎన్నికల హామీల్లో నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. బడ్జెట్‌లోదాని ఊసేలేదు. దీనికోసం నిధులు కేటాయి స్తారని అంతా అనుకున్నాం. ఈ ఏడాది భృతి లేన ట్టే. –వాండ్రాసి శివశంకర్, గ్రాడ్యుయేట్,విశాఖ
చంద్రబాబు ప్రభుత్వం మహిళలను మోసం చేసింది. సంవత్సరానికి మూడు గ్యాస్ సిలెండర్లు ఉచితంగా ఇస్తామన్నారు. కానీ ఆ హామీ నెరవేర్చలేదు. గ్యాస్ సబ్సిడీ కూడా సక్రమంగా బ్యాంక్ ఖాతాలో జమ కావడం లేదు. పేదకుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. బడ్జెట్లో గ్యాస్ సబ్సిడీకి నిధులు కేటాయించలేదు. చంద్రబాబు ప్రభుత్వానికి ప్రచారయావే తప్ప చిత్తశుద్ధి లేదు. గ్యాస్ సబ్సిడీ జమచేయకపోవడం వల్ల బడుగు, బలహీన వర్గాల కుటుంబాలు ఎంతో ఇబ్బంది పడుతున్నాయి. – బొడ్డా శ్రీదేవి, డ్వాక్రా సభ్యురాలు మంగవరం, పాయకరావుపేట


