‘సుఖీభవ’ నిధులకు కోత
రాష్ట్రంలో అధికారంలోని చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తోంది. జిల్లాలో కౌలు రైతులకు ఇప్పటివరకు అన్నదాత సుఖీభవ పథకం కింద ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.2024–25 ఆర్థిక సంవత్సరంలో నిధులు జమ చేయలేదు.ఎన్నికల ముందు రైతుల ఓట్లు రాబట్టుకోవడం కోసం అన్నదాత సుఖీభవ ఇస్తామని,జిల్లాలో మూత పడిన నాలుగు చక్కెర కర్మాగారాలను తిరిగి తెరిపిస్తామని ఇచ్చిన హామీ కూడా గాలికొదిలేశారు.అదేవిధంగా అన్నదాత సుఖీభవ లబ్ధిదారుల్లో భారీగా కోత పెట్టారు. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడానికి బడ్జెట్‌లో అవసరమైన నిధుల కేటాయింపు జరగలేదు.
– కర్రి అప్పారావు, జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు,అనకాపల్లి


