మాజీ డిప్యూటీ సీఎం బూడికి సన్మానం
మాడుగుల: మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడును దేవరాపల్లి మండలం తారువాలో ఆకుల ఫౌండేషన్ ప్రతినిధులు సంస్థ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం సన్మానించారు. అనంతరం నూతన సంవత్సర డైరీని అందజేశారు. ఈ సందర్భంగా ముత్యాలనాయుడు మాట్లాడుతూ ఆకుల ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాడుగుల నియోజకరవ్గంలో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. వైఎస్సార్‌సీపీ మాడుగుల పట్టణ అధ్యక్షుడు బొమ్మిశెట్టి శ్రీనివాసరావు, మాడుగుల యూత్ అధ్యక్షుడు కుక్కర శ్రీధర్, చీడికాడ మండలం యువజన విభాగం గొళ్ళవిల్లి త్రినాథస్వామి, ఆకుల ఫౌండేషన్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.


